LOADING...
India-Pakistan: పాక్‌ మరోసారి కవ్వింపు ప్రయత్నం.. LoC వద్ద కాల్పులు!
పాక్‌ మరోసారి కవ్వింపు ప్రయత్నం.. LoC వద్ద కాల్పులు!

India-Pakistan: పాక్‌ మరోసారి కవ్వింపు ప్రయత్నం.. LoC వద్ద కాల్పులు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2025
10:33 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం నియంత్రణ రేఖ (LoC) వద్ద పాకిస్థాన్‌ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. తాజా ఘటన జమ్ముకశ్మీర్‌లో కుప్వారా జిల్లాలోని నౌగామ్‌ సెక్టర్ వద్ద చోటుచేసుకుంది. అక్కడ భారత్-పాక్‌ సైన్యాల మధ్య కాల్పులు నమోదు అయ్యాయి. అధికార వర్గాల వివరాల ప్రకారం, శనివారం సాయంత్రం పాక్‌ బలగాలు ఎల్‌వోసీ వెంబడి నాలుగు రౌండ్లు కాల్పులు జరిపాయి. వీటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దాదాపు ఒక గంటపాటు సాగిన ఈ కాల్పుల్లో ఎవరికి గాయాలు కలగలేదని అధికార వర్గాలు తెలిపారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై భారత సైన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు.