LOADING...
Abdul Gani: హురియత్ మాజీ చీఫ్ అబ్దుల్ గనీ భట్ కన్నుమూత 
హురియత్ మాజీ చీఫ్ అబ్దుల్ గనీ భట్ కన్నుమూత

Abdul Gani: హురియత్ మాజీ చీఫ్ అబ్దుల్ గనీ భట్ కన్నుమూత 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 18, 2025
08:21 am

ఈ వార్తాకథనం ఏంటి

కశ్మీర్‌ వేర్పాటువాద నేతగా పేరుగాంచిన హురియత్‌ కాన్ఫరెన్స్‌ మాజీ అధ్యక్షుడు అబ్దుల్‌ గనీ భట్‌ (Abdul Gani Bhat) కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గనీ, వృద్ధాప్యం కారణంగా బారాముల్లా జిల్లా సోపోర్‌లోని తన స్వగృహంలోనే జీవితం ముగించారు. బుధవారం ఆయన చివరి శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. హురియత్‌ కాన్ఫరెన్స్‌ చర్చల్లో గనీ భట్‌ కీలక పాత్ర పోషించిన విషయం గమనార్హం. ముఖ్యంగా, గతంలో ఎన్‌డీఏ ప్రభుత్వంతో పాటు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంతో కూడా ఆయన చర్చలు జరిపారు. కశ్మీర్‌ సమస్య పరిష్కార దిశగా సంభాషణలు సాగేందుకు గనీ చేసిన కృషి ప్రత్యేకంగా నిలిచింది.

వివరాలు 

ఒమర్‌ అబ్దుల్లా సంతాపం

అబ్దుల్‌ గనీ మృతిపై జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా సంతాపం తెలిపారు. తమ రాజకీయ ఆలోచనలు, సిద్ధాంతాలు వేరైనా, గనీ ఎప్పుడూ మర్యాదపూర్వకంగా వ్యవహరించేవారని గుర్తుచేసుకున్నారు. సీనియర్‌ కశ్మీర్‌ నాయకుడిగా, అలాగే ప్రొఫెసర్‌గా విద్యావేత్తగా ఆయన చేసిన కృషిని జ్ఞాపకం చేసుకుంటూ, ఈ వార్త తెలిసి ఎంతో బాధ కలిగిందని ఎక్స్‌ వేదికలో పేర్కొన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఒమర్‌ అబ్దుల్లా చేసిన ట్వీట్