
JammuKashmir: జమ్ముకశ్మీర్‌లో 1.5 కిలోమీటర్ల పొడవైన త్రివర్ణ పతాకంతో ర్యాలీ.. ఇదిగో వీడియో
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్ దోడా జిల్లాలో సోమవారం దేశభక్తి జ్వాలను రగిలించిన ప్రత్యేక కార్యక్రమం జరిగింది. విద్యార్థులు ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించగా, ఈర్యాలీలో1,508మీటర్ల పొడవైన జాతీయ పతాకం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దోడా జిల్లా డిప్యూటీ కమిషనర్ హర్విందర్ సింగ్ నాయకత్వంలో వెల్కమ్ దోడా ఎంట్రీ గేట్ నుంచి కమ్యూనిటీ హాల్ వరకు ఈ మెగా ర్యాలీ కొనసాగింది. త్రివర్ణ పతాకాన్ని గర్వంగా పట్టుకున్న విద్యార్థులు దేశభక్తి గీతాలు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులతో పాటు, ప్రభుత్వంలోని పలు శాఖల ఉద్యోగులు కూడా ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారీ ఉత్సాహం మధ్య సాగిన ఈ తిరంగా ర్యాలీ తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
వైరల్ అవుతున్న వీడియో
#WATCH | Jammu and Kashmir: A 1508-metre-long national flag was displayed in Doda during the Tiranga rally yesterday.
— ANI (@ANI) August 12, 2025
(Source: District Administration Doda) pic.twitter.com/Cx0rSPTYhS