తదుపరి వార్తా కథనం

JK Cloudburst: జమ్ముకశ్మీర్‌లో మేఘ విస్ఫోటం మళ్లీ బీభత్సం.. నలుగురు మృతి
వ్రాసిన వారు
Jayachandra Akuri
Aug 17, 2025
09:49 am
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లో మళ్లీ మేఘ విస్ఫోటం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో చోటు చేసుకుంది. భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా మేఘాలు విరిగి పడటంతో ప్రమాదం జరిగింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్‌ఎఫ్, స్థానిక రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. వరద ముప్పు ఉన్న ప్రాంతాల నుంచి ప్రజలను తరలిస్తున్నారు. మరోవైపు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.