LOADING...
Jammu and Kahsmir: అనంత్‌నాగ్‌లో 'ఫేసియల్ రికగ్నిషన్‌' వ్యవస్థ ద్వారా యుఎపిఎ నిందితుడి అరెస్టు
అనంత్‌నాగ్‌లో 'ఫేసియల్ రికగ్నిషన్‌' వ్యవస్థ ద్వారా యుఎపిఎ నిందితుడి అరెస్టు

Jammu and Kahsmir: అనంత్‌నాగ్‌లో 'ఫేసియల్ రికగ్నిషన్‌' వ్యవస్థ ద్వారా యుఎపిఎ నిందితుడి అరెస్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 21, 2025
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

పహల్గాం దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌లో భద్రతా దళాలు ఉగ్రవాదుల వేటను మరింత ఉద్ధృతం చేశాయి. ఉగ్ర అనుమానితులను పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా సాంకేతిక సహాయాన్ని కూడా వారు వినియోగిస్తున్నారు.తాజాగా అనంత్‌నాగ్‌ జిల్లాలో ముఖ గుర్తింపు సాంకేతికత(ఫేసియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌)సాయంతో ఓ ఉగ్ర అనుమానితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ద్రాంగ్‌బల్‌ పాంపోర్‌కు చెందిన మునీబ్‌ ముస్తాఖ్‌ షేక్‌ను నిందితుడిగా పోలీసులు గుర్తించారు. గనీశ్‌బల్‌ వద్ద ఉన్న ఎక్స్‌రే పాయింట్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫేసియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ద్వారా అతడిని గుర్తించారు. ముఖ గుర్తింపు వ్యవస్థ అతడి వివరాలను గుర్తించి, వెంటనే సమాచారం కంట్రోల్‌ రూమ్‌కు పంపింది.

వివరాలు 

పోలీసుల అదుపులో మునీబ్‌

అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని మునీబ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసులు మునీబ్‌పై ఉగ్ర నిరోధక చట్టమైన యు.ఏ.పి.ఏ. (చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కింద పలు కేసులు నమోదైనట్లు విచారణలో గుర్తించారు. దీంతో అతడిపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో శాంతి భద్రతలు పరిరక్షించేందుకు, నేరస్థులను గుర్తించి త్వరగా పట్టుకునేందుకు ఆధునిక నిఘా సాంకేతికత ఎంతగానో ఉపయోగపడుతోందని పోలీసులు పేర్కొన్నారు. మునీబ్‌ను అరెస్టు చేయడమే ఇందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.