
Amit Shah : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం.. ముగ్గురు ఉగ్రవాదులు హతం.. లోక్‌సభలో అమిత్ షా ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడికి సంబంధించిన కీలక సమాచారం వెల్లడించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై రెండో రోజు కొనసాగుతున్న చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ దాడికి బాధ్యులైన ఉగ్రవాదుల్లో ముగ్గురిని భద్రతా బలగాలు హతమార్చినట్లు ప్రకటించారు. ''పహల్గాంలో టూరిస్టులపై దారుణమైన విధంగా దాడి చేశారు. కుటుంబ సభ్యుల సమక్షంలోనే వారిని అడిగిపెట్టీ హత్య చేశారు. మంతం, పేరు అడిగి గుండెల్లో తూటాలు వేసారు. ఇది మానవత్వానికి వ్యతిరేకంగా జరగిన మృగాళ్ల చర్య,'' అని షా ఆవేదన వ్యక్తం చేశారు.
Details
శాటిలైట్ ఫోన్ సిగ్నల్ ద్వారా కదలికలు
అమిత్ షా వివరించిన వివరాల ప్రకారం.. ఈ నెల 22న శాటిలైట్ ఫోన్ సిగ్నల్ ద్వారా ఉగ్రవాదుల కదలికలను గుర్తించి తక్షణమే ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో ముగ్గురు ఉగ్రవాదులు మట్టుబడ్డారు. అంతేగాక, దాడి జరిగిన రోజునే భద్రతా పరంగా సమీక్ష నిర్వహించినట్లు షా తెలిపారు. ఉగ్రవాదులకు సహకరించిన వారిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వారి శిబిరాలను కూడా ధ్వంసం చేశామన్నారు. "భద్రతా బలగాల సమన్వయంతో ఈ ప్రతీకార దాడిని విజయవంతంగా నిర్వహించాం. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్ము పోలీసులందరికీ అభినందనలు. ఉగ్రవాదులను అంతమొందించామంటే, ప్రతిపక్షాలు సంతోషిస్తారని భావించాం. కానీ ఇంకా సందేహాలు వ్యక్తం చేస్తుండటం బాధాకరమని అమిత్ షా విమర్శించారు.