
JK Encounter: జమ్ముకశ్మీర్‌లో భారీ ఎన్ కౌంటర్.. పలువురు ఉగ్రవాదులు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
దేశంలో ఉగ్రవాదుల ఏరివేత చర్యలు కొనసాగుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం ప్రారంభమైన ఆపరేషన్‌లో ఇప్పటి వరకు అనేకమంది ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. తాజాగా జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పలువురు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఉధంపూర్, కిష్త్వార్ ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో భద్రతా దళాలకు పక్కా సమాచారం అందింది.
Details
ఒక జవాను గాయపడినట్లు సమాచారం
వెంటనే ఆపరేషన్‌ను ప్రారంభించడంతో సైన్యం-ఉగ్రవాదుల మధ్య తీవ్ర కాల్పులు జరిగాయి. ఈ ముఠాలో ఏడుగురు ఉగ్రవాదులు చిక్కినట్లు తెలిసింది. కాల్పుల్లో ఒక జవాను గాయపడినట్టు సమాచారం. ఇక ఉధంపూర్‌లో పట్టుబడిన ఉగ్రవాదులు జైషే-ఏ-మహమ్మద్ సంస్థకు చెందిన వారేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ ఎన్‌కౌంటర్‌లో ఎంతమంది ఉగ్రవాదులు మట్టుబడ్డారన్న వివరాలను సైన్యం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.