LOADING...
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 04, 2026
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారిని జైషే మహ్మద్ ఉగ్రవాదులుగా గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జైషేకు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల గురించి నిఘా సమాచారం అందింది. దీని మేరకు భద్రతా దళాలు, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం వలన ఘర్షణ ప్రారంభమైంది. తరువాత మిలిటెంట్లు పరారయ్యారు.

వివరాలు 

గుహలో ఉన్న వారిపై కాల్పులు

ఉదంపూర్ ప్రాంతంలోని గుహల్లో వారు ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా బలగాలు మళ్లీ గాలింపు చర్యలు చేపట్టాయి. గుహలపై కాల్పులు జరిపిన తర్వాత, ఇద్దరు మిలిటెంట్లు హతమయ్యారు. వారిలో ఒకరు పాక్ జాతీయుడు కాగా, మరొకరు స్థానికుడని అధికారులు తెలిపారు. వారి నుంచి ఎం4 కార్బైన్‌ రైఫిల్స్‌, ఏకే-47 రైఫిల్స్‌, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

white knight corps చేసిన ట్వీట్ 

Advertisement