LOADING...
Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ సోనామార్గ్‌లో భారీగా విరిగిపడిన మంచు చరియలు
జమ్మూకశ్మీర్‌ సోనామార్గ్‌లో భారీగా విరిగిపడిన మంచు చరియలు

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌ సోనామార్గ్‌లో భారీగా విరిగిపడిన మంచు చరియలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 28, 2026
10:22 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి (Massive avalanche hits Jammu and Kashmir). ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదని అధికారులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. గండేర్‌బల్‌ జిల్లాలోని సోనామార్గ్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. పలు ఇళ్లు, రిసార్ట్‌లు, వాహనాలను మంచు కప్పేసింది. ఘటన తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రెస్క్యూ సిబ్బంది, స్థానిక అధికారులు అక్కడికి చేరుకొని.. సహాయక చర్యలు ప్రారంభించారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం లేదని అధికారులు వెల్లడించారు. మంగళవారం కశ్మీర్‌ అంతటా మంచు తీవ్రంగా కురిసిన క్రమంలో.. అధికారులు జమ్మూ-శ్రీనగర్‌ జాతీయరహదారిని మూసివేశారు.

వివరాలు 

కశ్మీర్‌ అంతటా పరిస్థితి గందరగోళం

శ్రీనగర్‌ విమానాశ్రయంలో పలు విమానాలను రద్దు చేశారు. దీంతో అనేకమంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. మంచు కురిసిన కారణంగా మంగళవారం కశ్మీర్‌ అంతటా పరిస్థితి గందరగోళంగా మారింది. జమ్మూ-శ్రీనగర్‌ జాతీయ రహదారిని తాత్కాలికంగా మూసివేశారు. అలాగే, శ్రీనగర్‌ విమానాశ్రయంలో కొన్ని విమానాల రద్దు జరిగింది, దీంతో అనేక పర్యాటకులు అక్కడే చిక్కిపోతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న మంచు దృశ్యాలు 

Advertisement