LOADING...
Bagu Khan: 100 కి పైగా చొరబాటు ప్రయత్నాల వెనుక ఉన్న'మానవ జిపిఎస్' బాగూఖాన్‌.. జమ్మూ కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో మృతి  
జమ్మూ కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో మృతి

Bagu Khan: 100 కి పైగా చొరబాటు ప్రయత్నాల వెనుక ఉన్న'మానవ జిపిఎస్' బాగూఖాన్‌.. జమ్మూ కాశ్మీర్ ఎన్‌కౌంటర్‌లో మృతి  

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 30, 2025
03:04 pm

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కీలక ఉగ్రవాది హతమయ్యాడు. 100కిపైగా ఉగ్ర చొరబాట్ల వెనుక ఉన్న ప్రధాన పాత్రధారి,హ్యూమన్ జీపీఎస్‌ (Human GPS)గా ప్రసిద్ధి చెందిన బాగూ ఖాన్‌ను కాల్చిచంపినట్లు భారత ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరో ఉగ్రవాదితో కలిసి భారత్‌లోకి చొరబడే ప్రయత్నంలో ఉండగా,భద్రతా దళాలు ఎదుర్కొని హతమార్చినట్లు తెలిపారు. 1995 నుంచి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ప్రాంతం నుంచి బాగూ ఖాన్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడని గుర్తించారు. గురెజ్‌ సెక్టార్‌లోని అనేక ప్రాంతాల నుంచి 100కు పైగా చొరబాట్లను ప్రణాళికబద్ధంగా జరిపించాడని, వాటి వెనుక ప్రధాన సూత్రధారిగా వ్యవహరించాడని వెల్లడించారు.

వివరాలు 

ఇద్దరు ఉగ్రవాదులు హతం 

ఎలాంటి కఠినమైన మార్గాల ద్వారానైనా ఉగ్రవాదులను భారత్‌లోకి దింపేందుకు సహకరించేవాడని, అతని ఆధ్వర్యంలో జరిగిన చొరబాట్లలో చాలా వరకు విజయవంతమైనవేనని భద్రతా వర్గాలు స్పష్టం చేశాయి. మొదట హిజ్బుల్ కమాండర్‌గా ఉన్న బాగూ ఖాన్‌ తన ప్రత్యేక ప్రతిభ కారణంగా అనేక ఉగ్రసంస్థలకు ముఖ్య సహాయకుడిగా మారాడు. ఎన్నాళ్లుగానో భద్రతా బలగాల కన్నుగప్పుతున్న అతడు.. ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఇదిలా ఉండగా, గురువారం రోజున గురెజ్ సెక్టార్‌ నుంచి నియంత్రణ రేఖ వెంబడి భారత్‌లోకి చొరబడుతున్న ఇద్దరు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది.