Page Loader
LPG Cylinder Price: భారీగా గ్యాస్ సిలిండర్ ధర 
LPG Cylinder Price: భారీగా గ్యాస్ సిలిండర్ ధర

LPG Cylinder Price: భారీగా గ్యాస్ సిలిండర్ ధర 

వ్రాసిన వారు Stalin
Mar 01, 2024
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

మార్చి నెల తొలిరోజే గ్యాస్ వినియోగదారులకు పెద్ద షాక్ తగిలింది. చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచాయి. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర దిల్లీలో రూ.25.50, ముంబైలో రూ.26 పెరిగినట్లు చమురు సంస్థలు తెలిపాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు వరుసగా రెండో నెలలో 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచడం గమనార్హం. అయితే 14 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. డొమెస్టిక్ సిలిండర్ ఫిబ్రవరిలో రూ.14 పెరిగిన విషయం తెలిసిందే. ధర పెరిగిన తర్వాత.. దిల్లీలో 19 కిలోల కమర్షియల్ ఎల్‌పిజి సిలిండర్ రూ.1,795 రూపాయలకు లభిస్తోంది. ముంబైలో రూ.1749, కోల్‌కతాలో రూ.1911, చెన్నైలో రూ.1960.50కి వాణిజ్య సిలిండర్ లభించనుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రూ.25 పెరిగిన ధర