Gas Cylinder Prices: భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
వాణిజ్య వంటగ్యాస్ వినియోగదారులకు మరోసారి భారీ భారం పడింది. చమురు సంస్థలు గ్యాస్ ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి.
19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను ఒక్కో సిలిండర్ పై రూ. 39 చొప్పున పెంచుతున్నట్లు తెలిపాయి. ఈ పెంపు నేటి తెల్లవారుజాము నుంచే అమలులోకి వస్తుంది.
తాజా పెంపుతో ఢిల్లీలో ఒక్కో వాణిజ్య సిలిండర్ ధర రూ. 1,691.50కి, కోల్‌కతలో రూ. 1,802.50కి, ముంబైలో రూ. 1,644కి, చెన్నైలో రూ. 1,855కి పెరిగింది.
ఒక్క నెల వ్యవధిలో కమర్షియల్ వంటగ్యాస్ ధరలు పెరగడం వరుసగా రెండోసారి.
Details
వంటగ్యాస్ ధరలు పెరగడం ఈ నెలలో రెండోసారి
గత నెల కూడా చమురు కంపెనీలు ఒక్కో సిలిండర్ పై రూ. 8.50 మేర పెంపు చేశాయి. ఇప్పుడూ మరోసారి రూ. 39 మేర పెంచడం గమనార్హం.
ఒక్క నెల వ్యవధిలో కమర్షియల్ వంటగ్యాస్ ధరలు పెరగడం వరుసగా రెండోసారి.
గత నెల కూడా చమురు కంపెనీలు ఒక్కో సిలిండర్ పై రూ. 8.50 మేర పెంపు చేశాయి. ఇప్పుడూ మరోసారి రూ. 39 మేర పెంచడం గమనార్హం.
గతంలో, మే, జూన్, జులై నెలల్లో చమురు కంపెనీలు వాణిజ్య వంటగ్యాస్ ధరలను కొంత తగ్గించాయి.
గృహావసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు.