LOADING...
LPG Imports: అమెరికాతో తొలిసారిగా దీర్ఘకాలిక LPG దిగుమతి ఒప్పందంపై సంతకం చేసిన భారత్
అమెరికాతో తొలిసారిగా దీర్ఘకాలిక LPG దిగుమతి ఒప్పందంపై సంతకం చేసిన భారత్

LPG Imports: అమెరికాతో తొలిసారిగా దీర్ఘకాలిక LPG దిగుమతి ఒప్పందంపై సంతకం చేసిన భారత్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 17, 2025
12:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంధన భద్రతను బలోపేతం చేయాలని కేంద్రం నిర్ణయించుకున్న నేపథ్యంలో, ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. అమెరికా నుంచి ఎల్‌పీజీ దిగుమతులపై చరిత్రాత్మక ఒప్పందం కుదిరిందని కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పూరీ సోమవారం ప్రకటించారు.

వివరాలు 

ఈ ఒప్పందం ఒక సంవత్సరం పాటు అమల్లో..

"భారత పౌరులకు సబబైన ధరలో ఎల్‌పీజీ అందించాలనే లక్ష్యంతో ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నాం. ఎల్‌పీజీ సరఫరా వనరులను విస్తరించడంలో భాగంగా ఇది కీలక ముందడుగుగా నిలిచింది. ఈ నేపథ్యంలో, మన దేశ పబ్లిక్ సెక్టార్‌ చమురు సంస్థలు అమెరికాతో ఒక ముఖ్య ఒప్పందాన్ని పూర్తి చేశాయి. ఈ ఒప్పందం ఒక సంవత్సరం పాటు అమల్లో ఉండనుంది. మొత్తం 2.2 MTPA ఎల్‌పీజీని అమెరికా నుంచి దిగుమతి చేసుకోబోతున్నాం. ఇది ప్రస్తుతం మన వార్షిక దిగుమతులలో దాదాపు 10% కి సమానం. యూఎస్ గల్ఫ్ కోస్ట్ నుంచే ఈ ఎల్‌పీజీ భారతదేశానికి రానుంది" అని హర్దీప్ సింగ్ ఎక్స్‌ ప్లాట్‌ఫార్మ్‌లో పోస్ట్ చేశారు.

వివరాలు 

మనం ఇళ్లల్లో వాడే వంట గ్యాస్‌ 'ఎల్‌పీజీ'

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందూస్థాన్ పెట్రోలియం సంస్థలు అమెరికన్ కంపెనీలతో గత కొన్ని నెలలుగా నిర్వహించిన చర్చల ఫలితంగానే ఈ ఒప్పందం సాధ్యమైందని ఆయన తెలిపారు. మన ఇళ్లలో వాడే వంటగ్యాస్‌ అదే ఎల్‌పీజీ అన్న సంగతి తెలిసిందే.