Page Loader
దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం.. విషవాయువు లీకేజీతో 16 మంది మృత్యువాత 
విషవాయువు లీకేజీతో 16 మంది మృత్యువాత

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం.. విషవాయువు లీకేజీతో 16 మంది మృత్యువాత 

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 06, 2023
12:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ ఆఫ్రికాలో అర్థరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. సౌత్ ఆఫ్రికన్ ముఖ్యనగరం జోహెన్నస్ బర్గ్ సమీపంలోని ఓ మురికివాడలో విషపూరితమైన గ్యాస్ లీకైంది. ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నట్లు అక్కడి అధికారులు గుర్తించారు. మరికొంత మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బోక్స్ బర్గ్ వద్ద అక్రమ మైనింగ్ కోసం ఉపయోగించే సిలిండర్ నుంచి ప్రమాదకరమైన గ్యాస్ లీకైనట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సిలిండర్ నుంచి ప్రమాదకరమైన గ్యాస్ లీకై 16 మంది మృతి