Page Loader
LPG cylinders: న్యూ ఇయర్ వేళ.. తగ్గిన LPG సిలిండర్ ధరలు
LPG cylinders: న్యూ ఇయర్ వేళ.. తగ్గిన LPG సిలిండర్ ధరలు

LPG cylinders: న్యూ ఇయర్ వేళ.. తగ్గిన LPG సిలిండర్ ధరలు

వ్రాసిన వారు Stalin
Jan 01, 2024
10:57 am

ఈ వార్తాకథనం ఏంటి

LPG cylinders get price-cut: నూతన సంవత్సరం ప్రారంభం వేళ.. చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు స్వల్ప ఊరటనిచ్చే ప్రకటన చేశాయి. వాణిజ్య LPG సిలిండర్‌ల ధరలను స్వల్పంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై రూ.1.50 నుంచి రూ.4.50 వరకు తగ్గించినట్లు పేర్కొన్నాయి. జనవరి 1 నుంచి తగ్గించిన ధరలు అమల్లోకి వస్తాయని చమురు మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి. అంతకుముందు డిసెంబర్ 22న కూడా వాణిజ్య సిలిండర్ ధరలను తగ్గించారు. అయితే, వంటగదిలో ఉపయోగించే 14 కిలోల గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రం తగ్గించలేదు. దీని ధరలు చివరిగా ఆగస్టు 30, 2023న మార్చబడ్డాయి.

గ్యాస్

దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఇలా..

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది. నేటి నుంచి దిల్లీలో 19కిలోల గ్యాస్ సిలిండర్ ధర రూ.1755.50కి చేరింది. గతంలో రూ.1757లో ఉండేది. ముంబైలో గతంలో రూ.1710కి లభించే ఈ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1708.50గా మారింది. చెన్నైలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.1929నుంచి రూ.1924.50కి తగ్గింది. కోల్‌కతాలో గ్యాస్ సిలిండర్ ఇప్పుడు రూ.1868.50గా ఉంది. అంతకుముందు రూ.1869 ఉంది. జనవరి 1, 2024నుండి విమానయానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF ధర)ధరలలో కూడా మార్పు జరిగింది. ఇప్పుడు ఢిల్లీలో ATF కొత్త ధర రూ. 1,01,993.17/Klగా ఉంది. ఈ ధర కోల్‌కతాలో రూ. 1,10,962.83/Kl, ముంబైలో రూ. 95,372.43/Kl, చెన్నైలో రూ. 1,06,042.99/Klగా మారింది.