వాణిజ్య సిలిండర్: వార్తలు
LPG Cylinder Price: భారీగా గ్యాస్ సిలిండర్ ధర
మార్చి నెల తొలిరోజే గ్యాస్ వినియోగదారులకు పెద్ద షాక్ తగిలింది.
LPG cylinders: న్యూ ఇయర్ వేళ.. తగ్గిన LPG సిలిండర్ ధరలు
LPG cylinders get price-cut: నూతన సంవత్సరం ప్రారంభం వేళ.. చమురు మార్కెటింగ్ కంపెనీలు గ్యాస్ వినియోగదారులకు స్వల్ప ఊరటనిచ్చే ప్రకటన చేశాయి.
వినియోగదారులకు షాక్.. గ్యాస్ సిలిండర్ ధరల పెంపు
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఆదివారం వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించాయి. సిలిండర్‌పై రూ.209 పెంచాయి.
Gas Cylinder price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మంగళవారం సవరించాయి.
గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర
19కిలోల కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ల ధరను రూ. 171.50 తగ్గిస్తున్నట్లు పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. మే 1 నుంచి తగ్గించిన ధరలు అమలులోకి వచ్చినట్లు వెల్లడించాయి.
నేటి నుంచి అమల్లోకి వచ్చిన తగ్గిన గ్యాస్ ధరలు; సీఎన్‌జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా
గ్యాస్ ధరలపై కొత్త మార్గదర్శకాలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే సవరించిన మార్గదర్శకాలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దేశంలో సహజ వాయువు ధరలను ప్రపంచ క్రూడ్ ధరలతో అనుసంధానించడానికి మార్గం సుగమమైంది. దీని వల్ల గ్యాస్ ధరలు తగ్గాయి.
వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు
దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. సహజ వాయువు ధరను నిర్ణయించడానికి కేంద్ర క్యాబినెట్ కొత్త పద్ధతిని ఆమోదించింది. దీంతో ఫైన్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలు దాదాపు 10శాతం తగ్గనున్నాయి.
వినియోగదారులకు గుడ్‌న్యూస్; వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయ్
వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు శనివారం ప్రకటించాయి. ఏప్రిల్ 1నుంచి తగ్గిన ధరలు తక్షణమే అమలులోకి వస్తాయని చమురు కంపెనీలు తెలిపాయి.