Page Loader
గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర
గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర

గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర

వ్రాసిన వారు Stalin
May 01, 2023
09:44 am

ఈ వార్తాకథనం ఏంటి

19కిలోల కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజీ) సిలిండర్ల ధరను రూ. 171.50 తగ్గిస్తున్నట్లు పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు తెలిపాయి. మే 1 నుంచి తగ్గించిన ధరలు అమలులోకి వచ్చినట్లు వెల్లడించాయి. ధరలను సవరించిన తర్వాత సవరణ తరువాత దిల్లీలో సోమవారం నుంచి 19 కిలోల వాణిజ్య సిలిండర్ రూ.1,856.50 ధరకు అందుబాటులో ఉంటుంది. ముంబైలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,808.50 కాగా, కోల్‌కతాలో ధర రూ.1,960.50కి తగ్గింది. చెన్నైలో రూ.2,021.50కి విక్రయిస్తున్నారు.

గ్యాస్

మార్చి 1న రూ.350.50 పెంపు

ధరలు తగ్గించడానికి ముందు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) ప్రకారం, 19కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర దిల్లీలో రూ. 2,028, కోల్‌కతాలో రూ. 2,132, ముంబైలో రూ. 1,980 చెన్నైలో రూ. 2,192.50కు విక్రయించేవారు. చివరి సారిగా ఏప్రిల్ 1న సిలిండర్ ధరలను రూ.91.50 తగ్గిచారు. అంతకుముందు మార్చి 1న కమర్షియల్‌ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరలను రూ.350.50, డొమెస్టిక్‌ సిలిండర్‌పై రూ.50 పెంచారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీలో రూ.1856.50కు తగ్గిన సిలిండర్ ధర