Page Loader
నేటి నుంచి అమల్లోకి వచ్చిన తగ్గిన గ్యాస్ ధరలు; సీఎన్‌జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా
సీఎంజీ కిలోకు రూ. 8.13 పీఎన్‌జీ రూ.5.06 తగ్గింపు

నేటి నుంచి అమల్లోకి వచ్చిన తగ్గిన గ్యాస్ ధరలు; సీఎన్‌జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా

వ్రాసిన వారు Stalin
Apr 08, 2023
11:51 am

ఈ వార్తాకథనం ఏంటి

గ్యాస్ ధరలపై కొత్త మార్గదర్శకాలను కేంద్ర క్యాబినెట్ ఆమోదించిన విషయం తెలిసిందే. అయితే సవరించిన మార్గదర్శకాలు శనివారం నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో దేశంలో సహజ వాయువు ధరలను ప్రపంచ క్రూడ్ ధరలతో అనుసంధానించడానికి మార్గం సుగమమైంది. దీని వల్ల గ్యాస్ ధరలు తగ్గాయి. కొత్త మార్గదర్శకాలకు అనుకులంగా అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ (ఏటీజీఎల్) కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలను కిలోకు రూ.8.13, పెట్రోలియం సహజ వాయువు (పీఎన్‌జీ) స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ (ఎస్‌సీఎం)కి రూ.5.06 తగ్గించింది. సీఎన్‌జీ వాహనాలు, నివాస గృహాలకు గ్యాస్ సరఫరా కోసం అడ్మినిస్టర్డ్ ప్రైస్ మెకానిజం (ఏపీఎం) ధరను భారత క్రూడ్ బాస్కెట్‌లో 10శాతం తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ఏటీజీఎల్ తెలిపింది.

గ్యాస్

ఎల్‌పీజీ‌తో పోలీస్తే పీఎన్‌జీ వినియోగదారులకు దాదాపు 15% ఆదా

భారత ప్రభుత్వం ప్రకటించిన కొత్త గ్యాస్ ధర మార్గదర్శకాల ప్రయోజనాన్ని పెద్ద సంఖ్యలో హోమ్ పీఎన్‌జీ, సీఎన్‌జీ వినియోగదారులకు అందించాలని నిర్ణయించించినట్లు ఏటీజీఎల్ వెల్లడించింది. ఈ నిర్ణయ ద్వారా పెట్రోల్ ధరలతో పోలిస్తే సీఎన్‌జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా అవుతుందని, ఎల్‌పీజీ ధరలతో పోలిస్తే హోమ్ పీఎన్‌జీ వినియోగదారులకు దాదాపు 15% ఆదా అవుతుందని ఏటీజీఎల్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇదిలా ఉంటే, గెయిల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన మహానగర్ గ్యాస్, దాని లైసెన్స్ పొందిన ఏరియాలో సీఎన్‌జీ రిటైల్ ధరలో కిలోకు రూ. 8, దేశీయ పీఎన్‌జీ రూ. 5 తగ్గించినటల్ ప్రకటించింది.