Page Loader
వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు
పీఎన్‌జీ, సీఎన్‌జీ ధరలను నిర్ణయించే కొత్త పద్ధతికి కేంద్రం ఆమోదం

వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్; 10శాతం తగ్గనున్న వంటగ్యాస్ ధరలు

వ్రాసిన వారు Stalin
Apr 07, 2023
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా ఉన్న గ్యాస్ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్ చెప్పింది. సహజ వాయువు ధరను నిర్ణయించడానికి కేంద్ర క్యాబినెట్ కొత్త పద్ధతిని ఆమోదించింది. దీంతో ఫైన్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ), కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలు దాదాపు 10శాతం తగ్గనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీతో పీఎన్‌జీ లేదా వంటగ్యాస్ ధరలు 10శాతం తగ్గుతాయి. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధర 6-9 శాతం వరకు చౌకగా లభించనుంది.

గ్యాస్ ధరలు

8వ తేదీనుంచి నూతన విధానం అమలు

సహజవాయువు ధరను నిర్ణయించేందుకు ప్రభుత్వం ఆమోదించిన కొత్త పద్ధతికి సంబంధించి కేంద్రం శుక్రవారం(ఏప్రిల్ 7) అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేస్తుందని ఠాకూర్ తెలిపారు. ఏప్రిల్ 8 (శనివారం) నుంచి నూతన విధానం అమల్లోకి వస్తుందని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో కిలో సీఎన్‌జీ ధర రూ. 5-8 తగ్గుతుంది. పీఎన్‌జీ ధర ఎస్‌సీఎం (స్టాండర్డ్ క్యూబిక్ మీటర్)కి రూ.5-6.5 తగ్గుతుంది..