'వంటగ్యాస్ ధరను తగ్గించాలి'; ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని పజైయసీవరం గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నిరసన సెగ తాకింది. వంటగ్యాస్ ధరను తగ్గించాలని గృహిణులు డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల కోసం సీతారామన్ 'వాల్ టు వాల్' ప్రచారాన్ని ప్రారంభించడానికి రాష్ట్ర మంత్రి ఎల్ మురుగన్‌తో కలిసి గ్రామాన్ని సందర్శించారు. కొంతమంది గృహిణులు ఆమెను వంట గ్యాస్ ధరలను తగ్గించాలని కోరారు. నిర్మలా సీతారామన్ గ్రామాన్ని సందర్శించిన సందర్భంగా స్థానికులను ప్రభుత్వం ప్రకటించిన ప్రయోజనాలు వారికి అందాయా అని ప్రశ్నించారు. ఆ సమయంలోనే గృహిణుల బృందం ఆమెను చుట్టుముట్టి వంట గ్యాస్ ధర తగ్గించాలని డిమాండ్ చేశారు.
వంటగ్యాస్ ధరను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుంది: నిర్మలా సీతారామన్
నిరసన తెలుపుతున్న మహిళలకు నిర్మలా సీతారామన్ సమాధానం చెప్పారు. వంటగ్యాస్ ధరను అంతర్జాతీయ మార్కెట్ నిర్ణయిస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. భారత్‌లో వంట గ్యాస్ లేదని, కేవలం దిగుమతి చేసుకుంటున్నామని చెప్పారు. భారత్‌కు దిగిమతి చేసే దేశం ధర పెంచితే, దేశంలో కూడా రేటు పెరుగుతుందని వివరించారు. అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గుతుందని వివరించారు. అయితే గత రెండేళ్లలో గ్యాస్ ధరలు పెద్దగా తగ్గలేదని నిర్మలా సీతారామన్ అన్నారు. ఆ తర్వాత ఆమె బీజేపీ కార్యకర్త నివాసానికి వెళ్లి అక్కడ కమలం గుర్తుకు రంగులు వేసి ప్రచారాన్ని ప్రారంభించారు.
ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి