బడ్జెట్ 2023: పన్ను విధానంలో మార్పులు, రూ.7 లక్షల వరకు ఆదాయ పన్నులేదు
'బడ్జెట్ 2023'లో ఆదాయపు పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. కొత్త పన్ను విధానంలో భాగంగా రూ.7 లక్షల వరకు ఎలాంటి ఆదాయపు పన్ను ఉండదని ప్రకటించారు. పన్ను విధానంలో కొన్ని సంవత్సరాలుగా చాలా తక్కువ మార్పులను మాత్రమే చేశారు. ఈ క్రమంలో పన్ను విధానంలో మార్పుల కోసం దిగువ, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్నారు. నిపుణులు కూడా ఈ బడ్జెట్‌లో పన్ను స్లాబ్‌ల్లో మార్పులు ఉంటాయని అంచనా వేశారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే కేంద్రం 2023-24 బడ్జెట్‌లో పన్ను మినహాయింపులను ఇచ్చింది.
పన్ను రాయితీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ. 7 వరకు పెంపు
కొత్త పన్ను విధానంలో ఆదాయపు పన్ను రాయితీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ. 7 లక్షలకు పెంచాలని బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. పన్ను స్లాబుల వివరాలను కూడా నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అవి ఇలా ఉన్నాయి. ఏడాదికి రూ.3 లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి పన్ను లేదు రు.3లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి 5శాతం పన్ను రూ.6లక్షల నుంచి రూ.9లక్షల వరకు ఆదాయం ఉంటే 10 శాతం పన్ను రూ. 12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు ఆదాయం ఉంటే 20 శాతం పన్ను రూ.15 లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉన్న వారికి 30 శాతం పన్ను