వినియోగదారులకు షాక్: భారీగా పెరిగిన కమర్షియల్, వంటగ్యాస్ సిలిండర్ ధరలు
పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు భారీ షాకిచ్చాయి. వాణిజ్య లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్‌పీజే) సిలిండర్‌లపై యూనిట్‌కు రూ. 350.50, వంట గ్యాస్ సిలిండర్‌పై యూనిట్‌కు రూ.50 చొప్పున పెంచాయి. పెంచిన ధరలు బుధవారం నుంచి తక్షణమే అమల్లోకి వస్తాయని చమురు సంస్థలు వెల్లడించాయి. ఈ ఏడాది వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. జనవరి 1న యూనిట్‌కు రూ.25 చొప్పున తొలిసారిగా పెంచారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ధరలు ఇలా ఉన్నాయి
దిల్లీలో వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర యూనిట్‌కు రూ. 2,119.50 కాగా, డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర యూనిట్‌కు రూ.1,103కు చెరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 8 నెలల తర్వాత వంటగ్యాస్ ధరలు పెరగడం పెరిగాయి. హైదరాబాద్‌లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 50 పెరిగింది. దీంతో ప్రస్తుతం రూ.1155లకు వంటగ్యాస్ పలుకుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో పెరిగిన ధరలను కలుపుకొని వంటగ్యాస్ సిలిండర్ రూ.1161కు చేరింది. గతంలో సిలిండర్ ధర పెరిగితే సబ్సిడీ కూడా పెరిగేది. అయితే ఇప్పుడు కేంద్రం సబ్సిడీ ఎత్తివేడంతో సామాన్యలపై భారం పడనుంది.