Gas Cylinder price: గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన వాణిజ్య సిలిండర్ ధరలు
ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలను మంగళవారం సవరించాయి. 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరను రూ.99.75 తగ్గించినట్లు పేర్కొన్నాయి. కొత్త ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. దిల్లీలో 19కిలోల కమర్షియల్ సిలిండర్ రిటైల్ విక్రయ ధర రూ.1,680 ఉంది. అలాగే, చమురు మార్కెటింగ్ కంపెనీలు డొమెస్టిక్ వంటగ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు చేయలేదు. వాటి ధరలను యథాతథంగా ఉంచాలని నిర్ణయించుకున్నాయి. వంటగ్యాస్ ధరలను ఈ ఏడాది మార్చి 1న చివరిసారిగా సవరించారు. జులైలో కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరను రూ.7 పెంచారు. వాణిజ్య, వంట గ్యాస్ సిలిండర్ ధరలను చమురు సంస్థలు నెలకొసారి సవరిస్తూ ఉంటాయి.