
LPG Price Cut: శుభవార్త చెప్పిన ఆయిల్ కంపెనీలు.. భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
చమురు కంపెనీలు వినియోగదారులకు శుభవార్తను అందించాయి. వాణిజ్య ఎల్‌పీజీ (కమర్షియల్) సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి.
19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.41 తగ్గింది. ఈ తగ్గింపును మంగళవారం నుంచి అమలులోకి తెస్తున్నట్లు వెల్లడించాయి.
సవరించిన ధరల ప్రకారం, దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,762కు చేరుకుంది.
ముంబయిలో రూ.1,714.50, కోల్‌కతాలో రూ.1,872, చెన్నైలో రూ.1,924.50కి తగ్గింది.
గ్లోబల్ మార్కెట్‌లో ముడి చమురు ధరల్లో మార్పులతో పాటు ఇతర ఆర్థిక పరిస్థితుల ఆధారంగా చమురు కంపెనీలు ప్రతి నెలా గ్యాస్ ధరలను సవరించడం ఆనవాయితీ.
వివరాలు
గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను యథాతథం
గత మార్చి 1న కమర్షియల్ సిలిండర్ ధర రూ.6 పెరిగిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 1న రూ.7 తగ్గించిన తర్వాత మళ్లీ ఇప్పుడు మరోసారి ధర తగ్గింది.
అయితే, గత డిసెంబర్‌లో మాత్రం ధర రూ.62 పెరిగింది. తాజా ధర తగ్గింపు ముఖ్యంగా రెస్టారెంట్లు, హోటళ్లు, బల్క్ ఎల్‌పీజీ వినియోగించే వ్యాపార వర్గాలకు కొంత ఉపశమనం కలిగించనుంది.
అయితే, చమురు కంపెనీలు 14.2 కిలోల గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్ ధరలను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశాయి.