LOADING...
Gas Cylinder Prices: గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పులు.. ఈ సారి ఎంత తగ్గాయంటే..?
ఈ సారి ఎంత తగ్గాయంటే..?

Gas Cylinder Prices: గ్యాస్ సిలిండర్ ధరల్లో భారీ మార్పులు.. ఈ సారి ఎంత తగ్గాయంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 01, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

డిసెంబర్‌ 1తో దేశవ్యాప్తంగా పలు కీలకమార్పులు అమల్లోకి వచ్చాయి. గ్యాస్ ధరలు,బ్యాంకింగ్ సేవలు సహా సామాన్య ప్రజలపై ప్రభావం చూపే అంశాల్లో కొన్ని కీలక నిర్ణయాలు ఈ రోజు నుంచే వర్తించనున్నాయి. సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీ వచ్చిందంటే గ్యాస్ ధరల్లో మార్పులు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఆయిల్ కంపెనీలు కొత్త ధరలను ప్రకటిస్తాయి.అందుకే నెల మొదటి రోజురాగానే సామాన్యులు, హోటల్ నిర్వాహకులు గ్యాస్ ధరలపై ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ధరల్లో స్వల్ప మార్పు జరిగినా దాని ప్రభావం నేరుగా సామాన్యులపై పడుతుంది కాబట్టి గ్యాస్ ధరలు ఎప్పుడూ అందరి దృష్టిలోనే ఉంటాయి. ఈనేపథ్యంలో ఈరోజు ఆయిల్ కంపెనీలు తాజా ధరలను విడుదల చేశాయి.వాటిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకున్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

వివరాలు 

తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర 

కమర్షియల్ పనుల కోసం ఉపయోగించే వాణిజ్య సిలిండర్ ధర కాస్త తగ్గింది. ఒక్క సిలిండర్‌పై రూ.10 తగ్గించారు. నవంబర్‌లో రూ.5 తగ్గించగా, అంతకుముందు అక్టోబర్‌లో రూ.12.50 పెరిగింది. అంతకు ముందు వరుసగా ఆరు నెలల పాటు ధరలు తగ్గించడమే గమనార్హం. గత కొద్దికాలంగా వాణిజ్య సిలిండర్ ధరలు తగ్గుతూ రావడంతో హోటళ్లు, క్యాటరింగ్ రంగానికి మంచి ఊరట లభిస్తోంది. తాజా తగ్గింపుతో ప్రస్తుతం ఢిల్లీలో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,580.50గా ఉంది. గతంలో ఇది రూ.1,590గా ఉండేది. ఇక కోల్‌కతాలో రూ.1,684, ముంబైలో రూ.1,531, చెన్నైలో రూ.1,739గా ధరలు కొనసాగుతున్నాయి.

వివరాలు 

స్ధిరంగా డొమెస్టిక్ గ్యాస్ ధర 

ఇళ్లలో వాడే డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు జరగలేదు. గత కొద్ది నెలలుగా డొమెస్టిక్ గ్యాస్ ధరలు యథాతథంగా కొనసాగుతున్నాయి. చివరి సారి ఈ ధరల్లో మార్పు ఈ ఏడాది ఏప్రిల్ నెలలోనే జరిగింది. ప్రస్తుతం ఢిల్లీలో 14.2 కిలోల గృహ వినియోగ సిలిండర్ ధర రూ.853గా ఉంది. కోల్‌కతాలో రూ.879, ముంబైలో రూ.852, చెన్నైలో రూ.868గా కొనసాగుతున్నాయి. ఇక హైదరాబాద్‌లో 14.2 కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.861.96గా నమోదైంది.

Advertisement