
మహారాష్ట్ర: గ్యాస్ సిలిండర్లు పేలి బస్సులు దగ్ధం
ఈ వార్తాకథనం ఏంటి
మహారాష్ట్రలో పింప్రి చించ్‌వాడ్ నగరంలో ఘోర ప్రమాదం జరిగింది. ఎల్‌పీజీ సిలిండర్లు పేలడంతో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
సిలిండర్ల పేలుడు ధాటికి సమీపంలోని కళాశాలకు చెందిన రెండు బస్సులు కూడా దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు.
ట్యాంకర్ నుంచి సిలిండర్లలోకి ఎల్‌పీజీని అక్రమంగా నింపుతున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ సంఘటన ఆదివారం రాత్రి 10:30 గంటల ప్రాంతంలో జరిగిందని అధికారులు పేర్కొన్నారు. నాలుగు నుంచి ఐదు ఎల్‌పీజీ సిలిండర్లు పేలినట్లు అధికారులు తెలిపారు.
ఇంత ప్రమాదం జరిగినా, సమీపంలోని ఎల్‌పీజీ ఉన్న ట్యాంకర్‌కు మంటలు అంటుకోకపోవడం గమనార్హం. ట్యాంకర్‌కు మంటలు అంటుకుంటే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేదని అధికారులు చెబుతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ప్రమాదం జరిగిన స్థలంలోని దృశ్యాలు
#WATCH | Maharashtra: A massive fire broke out following explosions in gas cylinders in the Tathawade area of Pimpri-Chinchwad. 6 fire tenders present at the spot. The situation is under control: Pimpri-Chinchwad Fire Department (08.10) pic.twitter.com/4hEoZf4fbw
— ANI (@ANI) October 8, 2023