LPG Price Hike: వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరిగిన LPG గ్యాస్ ధరలు
2024 డిసెంబర్ 1 నుంచి ఎల్‌పీజీ గ్యాస్ ధరలు పెరిగాయి. ముఖ్యంగా వాణిజ్య సిలిండర్లలో ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఆదివారం తెల్లవారుజామున 19 కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ. 1802 నుంచి రూ. 1818.50 వరకు పెరిగింది. అంటే 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధర రూ. 16.5 పెరిగడం విశేషం. ఈ పెరుగుదల IOCL వెబ్‌సైట్ ప్రకారం, డిసెంబర్ 1, 2024 నుంచి అమల్లోకి వచ్చింది. 14.2 కేజీల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం సవరించలేదు. గత జూలైలో వీటిపై పెరుగుదల జరిగినా, ఆ తర్వాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు అదే స్థాయిలో ఉన్నాయని అధికారులు తెలిపారు.
గ్యాస్ సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే
ప్రస్తుతం, పాట్నాలో 14 కేజీల సిలిండర్ ధర రూ. 892.50గా ఉంది. దిల్లీలో రూ. 803. ఇతర ప్రధాన నగరాల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి కోల్‌కతా: రూ. 829, ముంబై: రూ. 802.50, చెన్నై: రూ. 818.50, హైదరాబాద్ : రూ. 855, విజయవాడ : రూ. 818.50 19 కేజీల వాణిజ్య సిలిండర్ ధరలు ప్రధాన నగరాల్లో పెరిగాయి. కోల్‌కతా : రూ. 1927 (నవంబర్‌లో రూ.1911.50), ముంబై : రూ. 1771 (నవంబర్‌లో రూ.1754.50), పాట్నా : రూ. 2072.50 చెన్నై : రూ. 1980.50 విజయవాడ : రూ.1962 (రూ.61 పెరిగింది), హైదరాబాద్ : రూ.2028 (రూ.61 పెరిగింది) ఈ ధరల పెరుగుదల వినియోగదారులపై ప్రభావం చూపించి, వ్యాపార వ్యయాలను పెంచే అవకాశం ఉంది.