LOADING...
Gas cylinder: గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగు, వాసన రావడానికి కారణమిదే!
గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగు, వాసన రావడానికి కారణమిదే!

Gas cylinder: గ్యాస్ సిలిండర్ ఎరుపు రంగు, వాసన రావడానికి కారణమిదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 18, 2026
05:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఈ రోజుల్లో గృహ వినియోగంలో గ్యాస్‌ సిలిండర్‌ అనేది తప్పనిసరి అవసరంగా మారింది. అయితే మీరు గమనించారా? గ్యాస్‌ సిలిండర్‌ ఎప్పుడూ ఎరుపు రంగులోనే ఉంటుంది. మరి ఇతర రంగుల్లో ఎందుకు తయారు చేయరు? ఈ ప్రశ్న చాలా మందికి ఎప్పుడో ఒకసారి తలెత్తే ఉంటుంది. దీనికి భద్రతా కారణాలతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Details

గ్యాస్‌ సిలిండర్‌ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?

ఎరుపు రంగును ప్రపంచవ్యాప్తంగా ప్రమాదం, హెచ్చరికకు సంకేతంగా పరిగణిస్తారు. ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌లో మండే వాయువు ఉండటంతో అది సహజంగానే ప్రమాదకరమైన వస్తువే. వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలన్న ఉద్దేశంతో సిలిండర్‌కు ఎరుపు రంగును ఉపయోగిస్తారు. శాస్త్రీయంగా కూడా ఎరుపు రంగుకు ప్రత్యేకత ఉంది. ఇతర రంగులతో పోలిస్తే ఎరుపు రంగు దూరం నుంచే స్పష్టంగా కనిపిస్తుంది. తక్కువ వెలుతురు ఉన్న చోట్లైనా, గిడ్డంగుల్లోనైనా ఎరుపు రంగును గుర్తించడం చాలా సులభం. అందుకే ప్రమాదానికి సంబంధించిన వస్తువులను ఎరుపు రంగులోనే తయారు చేస్తారు. గ్యాస్‌ సిలిండర్‌ ప్రమాదకరమైనది కాబట్టి, వినియోగదారుల భద్రత దృష్ట్యా కంపెనీలు దీనికి ఎరుపు రంగును ఎంచుకుంటాయి.

Details

గ్యాస్‌కు వాసన ఎందుకు ఉంటుంది?

ఎల్‌పీజీ గ్యాస్‌కు సహజంగా ఎలాంటి వాసన ఉండదు. అది రంగులేని, వాసన లేని మండే వాయువు. అలాంటి పరిస్థితిలో గ్యాస్‌ లీక్‌ అయినా గుర్తించడం చాలా కష్టం. అలా అయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే భద్రత కోసమే ఎల్‌పీజీ గ్యాస్‌లో 'ఇథైల్ మెర్కాప్టన్' అనే రసాయనాన్ని కలుపుతారు. దీనివల్ల గ్యాస్‌కు ప్రత్యేకమైన వాసన వస్తుంది. గ్యాస్‌ లీక్‌ అయిన వెంటనే ఆ వాసన ద్వారా వినియోగదారులు అప్రమత్తమవుతారు . వెంటనే చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదాలు నివారించవచ్చు. మొత్తానికి, గ్యాస్‌ సిలిండర్‌ ఎరుపు రంగులో ఉండటం, గ్యాస్‌కు వాసన రావడం రెండూ మన భద్రత కోసమే తీసుకున్న కీలక జాగ్రత్తలని చెప్పుకోవచ్చు.

Advertisement

Details

గ్యాస్‌కు వాసన ఎందుకు ఉంటుంది?

ఎల్‌పీజీ గ్యాస్‌కు సహజంగా ఎలాంటి వాసన ఉండదు. అది రంగులేని, వాసన లేని మండే వాయువు. అలాంటి పరిస్థితిలో గ్యాస్‌ లీక్‌ అయినా గుర్తించడం చాలా కష్టం. అలా అయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే భద్రత కోసమే ఎల్‌పీజీ గ్యాస్‌లో 'ఇథైల్ మెర్కాప్టన్' అనే రసాయనాన్ని కలుపుతారు. దీనివల్ల గ్యాస్‌కు ప్రత్యేకమైన వాసన వస్తుంది. గ్యాస్‌ లీక్‌ అయిన వెంటనే ఆ వాసన ద్వారా వినియోగదారులు అప్రమత్తమవుతారు. వెంటనే చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదాలు నివారించవచ్చు. మొత్తానికి, గ్యాస్‌ సిలిండర్‌ ఎరుపు రంగులో ఉండటం, గ్యాస్‌కు వాసన రావడం రెండూ మన భద్రత కోసమే తీసుకున్న కీలక జాగ్రత్తలని చెప్పుకోవచ్చు.

Advertisement