Page Loader
Cooking gas: సామాన్యులకు షాక్.. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు
సామాన్యులకు షాక్.. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు

Cooking gas: సామాన్యులకు షాక్.. వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 07, 2025
04:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సామాన్యులపై మరోసారి భారాన్ని మోపింది. దేశవ్యాప్తంగా వంటగ్యాస్ ధరలను భారీగా పెంచింది. ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.50 పెంచుతూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఉజ్వల యోజన కింద సరఫరా అయ్యే సిలిండర్‌లపై కూడా ఇదే మేరకు రూ.50 పెంపు ఉంటుందని స్పష్టం చేసింది. పెరిగిన ధరలు మంగళవారం నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.

వివరాలు 

 వారంకూడా గడవకముందే మళ్లీ రూ.50 పెంపు  

ఇకపోతే, సాధారణంగా ప్రతి నెల మొదటి తేదీన వంటగ్యాస్ ధరలు మారతాయన్న విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా వాణిజ్య వినియోగ సిలిండర్ ధరలను పెంచుతూ ప్రజలకు వరుస షాకులు ఇస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఏప్రిల్ 1న కొత్త ధరలను ప్రకటించాయి. అయితే, ఈసారి మాత్రం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించడమే కాకుండా, వారంకూడా గడవకముందే మళ్లీ రూ.50 పెంచుతూ మరో నిర్ణయం తీసుకోవడంతో సామాన్యుల ఆందోళన పెరిగింది.