Page Loader
ఇటలీ: ఆపి ఉంచిన వ్యాన్‌లో భారీ పేలుడు, మంటల్లో చిక్కుకున్న వాహనాలు 
ఇటలీ: ఆపి ఉంచిన వ్యాన్‌లో భారీ పేలుడు, మంటల్లో చిక్కుకున్న వాహనాలు

ఇటలీ: ఆపి ఉంచిన వ్యాన్‌లో భారీ పేలుడు, మంటల్లో చిక్కుకున్న వాహనాలు 

వ్రాసిన వారు Stalin
May 11, 2023
05:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర ఇటలీలోని మిలాన్ నగరంలో భారీ పేలుడు సంభవించింది. పార్క్ చేసిన కారులో పేలుడు సంభవించడం సంచలనంగా మారింది. ఆ తర్వాత అనేక వాహనాలు మంటల్లో చిక్కుకుని బూడిదయ్యాయి. పోలీసులు విడుదల చేసిన సీసీటీవీ ఫుటేజీల్లో వాహనాలు కాలిపోవడం, నల్లటి పొగలు రావడం వంటివి కనిపిస్తున్నాయి. అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తోంది. పార్క్ చేసిన కారు గ్యాస్ సిలిండర్‌లో పేలడం వల్లే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పేలుడు వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

పేలుడు వల్ల చెలరేగుతున్న మంటలు