
LPG Cylinder Price: గుడ్ న్యూస్.. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.150 తగ్గింపు
ఈ వార్తాకథనం ఏంటి
ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర ను చమురు విక్రయ సంస్థలు తగ్గించాయి.
రూ.19 కిలోల సిలిండర్ పై రూ.158 తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.దీంతో దేశ రాజధాని దిల్లీలో సిలిండర్ ధర రూ.1,522.50కు చేరింది. ఈ రేట్లు నేటి నుంచే అంటే సెప్టెంబర్ 1 నుంచి వర్తిస్తాయి.
హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీ కోట్టుల వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇటీవల గృహ వినియోగ సిలిండర్ పైన రూ. 200 తగ్గిస్తూ కేంద్ర కేబినేట్ ఇటీవలే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మూడు రోజుల కింద రాఖీ పండుగ సందర్భంగా కేంద్ర కేబినేట్ డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ రూ.200 తగ్గించింది.
Details
75 లక్షల మంది మహిళలకు ఉజ్వల పథకం కింద గ్యాస్ కనెక్షన్లు
అయితే ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారికి అదనంగా మరో రూ.200 రాయితీ ఇచ్చిన విషయం తెలిసిందే.
బీజేపి అధికారంలోకి వచ్చినప్పుడు దేశంలో 14.5 కోట్ల ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఉండేవని, అవి ఇప్పుడు 33 కోట్లకు పెరిగాయని, వచ్చే రోజుల్లో 75 లక్షల మంది మహిళలకు ఉజ్వల పథకం గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది.
మరోవైపు ఉజ్వల పథకం మహిళలు ఉచితంగా గ్యాస్ స్టవ్, సిలిండర్ బుడ్డి, పైపును ఉచితంగా అందించనున్నారు.
గతంలో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1155 ఉండగా.. తగ్గిన ధరతో సిలిండర్ ధర రూ.955కు చేరింది.