Cooking Gas: గుడ్ న్యూస్.. వంట గ్యాస్ సిలిండర్ ధర రూ.200 తగ్గించాలని కేంద్రం నిర్ణయం
ఈ వార్తాకథనం ఏంటి
రాఖీ పండగ వేళ కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు ఉపశమనం కలిగించేందుకు 14 కిలోల వంటగ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.
ఉజ్వల పథకం కింద అందించే 14కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.200తగ్గించేందుకు ఆమోదం తెలిపింది.
ప్రస్తుతం ఎల్‌పీజీ సిలిండర్ ధర దిల్లీలో రూ.1053, ముంబైలో రూ.1052.50, చెన్నైలో రూ.1068.50, కోల్‌కతాలో రూ.1079గా ఉంది.
జులైలో దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరను చమురు కంపెనీలు రూ.50 పెంచాయి. గతంలో మే నెలలో రెండుసార్లు ధరలు పెంచాయి.
ఈ ఏడాది చివర్లో జరగనున్న రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరాం వంటి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసున్నట్లు తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్రం కీలక నిర్ణయం
Breaking ⚡#LPG Price Cut: Govt Decides To Decrease Cost Of Cooking Gas By Rs 200/Cylinder.#Gas#LPGGas #government #cylinder pic.twitter.com/Xgu1ATHw1b
— Mohit (@Mohit01251) August 29, 2023