LPG: కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గింపు.. నేటి నుంచి కొత్త రేట్లు అమల్లోకి!
ఈ వార్తాకథనం ఏంటి
కొత్త ఎల్‌పీజీ సిలిండర్ ధరలు నవంబర్ 1 (2025) నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు కంపెనీలు 19 కిలోల కమెర్షియల్ సిలిండర్ల ధరల్లో మార్పులు చేపట్టాయి. ఈ సవరించిన ధరలు ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,590.50 నుంచి రూ.1,595.50కి పెరిగింది. అంటే గరిష్టంగా రూ.5 పెరుగుదల నమోదైంది. కాగా, వంట గ్యాస్ (గృహ వినియోగం)ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, గత నెల అక్టోబరులో కమెర్షియల్ సిలిండర్ ధరను రూ.15 మేర పెంచారు. అయితే, నవంబర్ నెలలో ఆ ధరను రూ.5 మేర తగ్గించినట్లు ప్రభుత్వం పేర్కొంది.
Details
తాజా ధరల ప్రకారం
ముంబైలో: రూ.1,542 కోల్‌కతాలో: రూ.1,694 చెన్నైలో: రూ.1,750 అదనంగా IOCL వెబ్‌సైట్ ప్రకారం ప్రస్తుతం 19 కిలోల సిలిండర్ ధరలు ఈ విధంగా ఉన్నాయి పాట్నా: రూ.1,876 నోయిడా: రూ.1,876 లక్నో: రూ.1,876 భోపాల్: రూ.1,853.5 గురుగ్రామ్: రూ.1,607 కమెర్షియల్ సిలిండర్లను ప్రధానంగా హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, మరియు ఇతర వాణిజ్య సంస్థలు వినియోగిస్తాయి. అయితే, గృహ వాడుక గ్యాస్ ధరల్లో ఎలాంటి తగ్గింపు లేకపోవడంతో ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.