తదుపరి వార్తా కథనం

Gas Cylinder: డిసెంబర్ 28 నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్
వ్రాసిన వారు
Stalin
Dec 20, 2023
01:19 pm
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే అందించేందుకు సిద్ధమవుతోంది.
ఈ నెల 28 నుంచి రూ.500కే గ్యాస్ సిలిండర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
డిసెంబర్ 28న కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఆరోజే.. సిలిండర్ పంపిణీ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం యోచిస్తోంది.
ఇప్పటికే సివిల్ సప్లయ్ డిపార్ట్‌మెంట్ అధికారులు ఈ కార్యక్రమానికి సంబంధించి కార్యచరణను సిద్ధం చేసే పనిలో ఉన్నారు.
ఈ క్రమంలో రాష్ట్రంలో ఎంతమంది వినయోగదారులు ఉన్నారు? ఈ పథకం ఎవరెవరికి వర్తిస్తుందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున సిలిండర్ పంపిణీకి శ్రీకారం
డిసెంబర్ 28 నుంచే రూ.500 కు గ్యాస్ సిలిండర్! https://t.co/iwuNhHBOdr
— News 1 TV (@News1DigitalTv) December 20, 2023