LOADING...
LPG Gas Cylinder Price: గుడ్‌న్యూస్..ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ తగ్గింపు 
తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

LPG Gas Cylinder Price: గుడ్‌న్యూస్..ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ తగ్గింపు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 01, 2023
11:53 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతినెలా ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలో మార్పులు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో గ్యాస్ వినియోగదారులకు చమురు కంపెనీలు శుభవార్తను తెలిపాయి. ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను విక్రయించే కంపెనీలు ధరను మరింత తగ్గించాలని నిర్ణయించుకున్నాయి. తాజాగా జూన్ 1న వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై రూ.80.50 మేర తగ్గించాయి. అయితే గత నెలలో అంటే మే 1న ఇదే సిలిండర్ ధరపై రూ. 172 తగ్గింది. ప్రస్తుతం గృహ అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

Details

తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా ధరలు

కేవలం కమర్షియల్ సిలిండర్ ధరల్లో మాత్రమే మార్పు వచ్చింది. న్యూఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై రూ.83.50 తగ్గడంతో ప్రస్తుతం రూ. 1773 కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. ఏపీలో రూ.1161 ఉండగా.. హైదరాబాద్ లో సిలిండర్ ధర రూ.1155 ఉంది. గత నెలలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ రూ.1856.50 ఉండేది. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.1103గా ఉంది. కోల్ కతా లో 1960.50 ఉండగా.. ప్రస్తుతం తగ్గడంతో రూ.1875.50కి చేరింది. ముంబైలో రూ.1808.5 నుంచి రూ.1725కి చేరింది.

Advertisement