LOADING...
Two Buses Collide: తమిళనాడులో రెండు బస్సులు ఢీ.. ఎనిమిది మంది మృతి
తమిళనాడులో రెండు బస్సులు ఢీ.. ఎనిమిది మంది మృతి

Two Buses Collide: తమిళనాడులో రెండు బస్సులు ఢీ.. ఎనిమిది మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 24, 2025
12:39 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఒకదానికొకటి ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ భయంకర ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం తెల్లవారుజామున తెన్కాసి జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. అతివేగమే ప్రమాదానికి కారణమని అక్కడి వారు చెబుతున్నారు. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. మధురై నుంచి సెంకోట్టై వైపు వస్తున్న ప్రైవేట్ బస్సు, తెన్కాసి నుంచి కోవిల్పట్టికి బయలుదేరిన మరో బస్సుతో ఎదురెదురుగా ఢీ కొట్టింది. ఢీకొన్న ప్రభావంతో రెండు బస్సులు పూర్తిగా దెబ్బతిన్నాయి.

వివరాలు 

ఆందోళనకరంగా  కొందరి పరిస్థితి.. 

సంఘటన స్థలంలోనే ఎనిమిది మంది ప్రయాణికులు మరణించగా, దాదాపు 28 మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సంఘటనాస్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం ఇచ్చి, రక్షణ చర్యలను ప్రారంభించారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి ఆందోళన కలిగించేలా ఉందని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మధురై-సెంకోట్టై రూట్‌లో వెళ్తున్న బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమన్న ప్రాథమిక సమాచారం బయటపడింది. క్షతగాత్రుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తమిళనాడులో రెండు బస్సులు ఢీ