LOADING...
Tamilnadu: నటి త్రిష,సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగలోకి పోలీసులు 
నటి త్రిష,సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగలోకి పోలీసులు

Tamilnadu: నటి త్రిష,సీఎం స్టాలిన్ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగలోకి పోలీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 03, 2025
10:29 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళ్, తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన హీరోయిన్ త్రిష ఇంటికి కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ప్రస్తుతం చెన్నైలో ఉన్న త్రిషకు, ఆమె ఇంట్లో బాంబు పెట్టామని, మరికొన్ని గంటల్లో పేలుస్తామని ఆగంతకులు కాల్ చేశారు. ఈ సమాచారం అందిన వెంటనే, పోలీస్ అధికారులు డాగ్ స్క్వాడ్ సహాయంతో ఆమె నివాసంలో తనిఖీలు నిర్వహించారు. త్రిష ఇంటి పరిసర ప్రాంతాన్ని ప్రతి అంగుళం మేరా క్షుణ్ణంగా పరిశీలించారు పోలీసులు. ఏ విధమైన పేలుడు పదార్థాలు కనుగొనబడలేదు. అలాగే తమిళనాడు సీఎం స్టాలిన్ నివాసం, గవర్నర్ భవనం, రాష్ట్ర బీజేపీ ఆఫీస్ కు ఈ తెల్లవారుజామున బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి.

వివరాలు 

తమిళనాడు బీజేపీ ఆఫీస్ కూడా బాంబు

ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసానికి కూడా ఈ బెదిరింపు కాల్స్ రావడం తమిళనాడు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. అదేవిధంగా గవర్నర్ భవనానికి వచ్చిన బెదిరింపుల కేసు కూడా ప్రజల్లో ఆందోళన సృష్టించింది. తమిళనాడు బీజేపీ ఆఫీస్ కూడా బాంబు పెట్టినట్టు అగంతకులు సమాచారం ఇచ్చారు. పోలీసులు అత్యంత అప్రమత్తతతో స్పందించి,డాగ్ స్క్వాడ్ సహాయంతో ఈ మూడు స్థలాల్లోనూ తనిఖీలు నిర్వహించారు. కానీ ఏ స్థలంలోనూ పేలుడు పదార్థాలు లభించకపోవడంతో,ఈ కాల్స్ ఫేక్ అని పోలీసులు తేల్చారు. ప్రస్తుతం చెన్నై పోలీసులు ఆ బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు,ఆ ఫోన్ నంబర్ ఆధారంగా పరిశోధన చేపట్టారు. ఈసంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో పోలీస్ అధికారులు వెల్లడించనున్నారు.