LOADING...
Foxconn-Tamil Nadu: తమిళనాడులో భారీ పెట్టుబడి పెట్టనున్న ఫాక్స్‌కాన్‌ 
తమిళనాడులో భారీ పెట్టుబడి పెట్టనున్న ఫాక్స్‌కాన్

Foxconn-Tamil Nadu: తమిళనాడులో భారీ పెట్టుబడి పెట్టనున్న ఫాక్స్‌కాన్‌ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 13, 2025
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

తైవాన్‌కు చెందిన ఐఫోన్‌ కాంట్రాక్ట్‌ తయారీ సంస్థ ఫాక్స్‌కాన్‌ తమిళనాడులో మరోసారి భారీ పెట్టుబడులతో ముందుకు రావడానికి సిద్ధమైంది. ఈ సంస్థ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టి, 14 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రి టి.ఆర్.బి. రాజా ఈ పెట్టుబడిని ఇప్పటివరకు రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద ఇన్వెస్ట్‌మెంట్‌గాపేర్కొన్నారు. మంత్రి రాజా తన ఎక్స్‌ (X) ఖాతాలో చేసిన పోస్ట్‌లో, "ఇది తమిళనాడులో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఇంజినీరింగ్‌ పెట్టుబడి. ఫాక్స్‌కాన్‌ రూ.15 వేల కోట్ల పెట్టుబడి పెట్టి, 14 వేల ఉన్నత స్థాయి ఉద్యోగాలు సృష్టించనుంది. ఇంజినీర్లు సిద్ధంగా ఉండండి" అని తెలిపారు.

వివరాలు 

ఫాక్స్‌కాన్‌ ఇండియా ప్రతినిధితో ఎం.కె. స్టాలిన్‌ భేటీ

అలాగే, ఈ పెట్టుబడికి సంబంధించి అవసరమైన అనుమతులు వేగంగా లభించేలా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక సంస్థ 'గైడెన్స్‌ తమిళనాడు' ప్రత్యేక సహాయక డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా ఎలక్ట్రానిక్స్‌, అడ్వాన్స్‌డ్‌ మ్యానుఫాక్చరింగ్‌ రంగాల్లో తమిళనాడుకు మరో విపులమైన ప్రోత్సాహంలభించిందని పేర్కొన్నారు. ఫాక్స్‌కాన్‌ ఇండియా ప్రతినిధితో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ భేటీ అయినట్లు రాజా వెల్లడించారు. ఆ సమావేశం ద్వారా ఫాక్స్‌కాన్‌ సంస్థకు తమిళనాడుపై ఉన్న నమ్మకం, విశ్వాసం మరింతగా బలపడిందని తెలిపారు. ఈ పెట్టుబడి ద్వారా రాష్ట్రానికి ఉద్యోగావకాశాలు పెరగడమే కాకుండా, తయారీ రంగంలో తమిళనాడు మరింత ముందంజలోకి వెళ్తుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.