LOADING...
TVK Vijay: విజయ్ బస్సు కింద పడి నలుగురికి గాయాలు.. తీవ్రస్థాయిలో విమర్శలు
విజయ్ బస్సు కింద పడి నలుగురికి గాయాలు.. తీవ్రస్థాయిలో విమర్శలు

TVK Vijay: విజయ్ బస్సు కింద పడి నలుగురికి గాయాలు.. తీవ్రస్థాయిలో విమర్శలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2025
01:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో కరూర్‌లో జరిగిన టీవీకే బహిరంగ సభలో ఘోర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాట కారణంగా సుమారు 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 111 మంది తీవ్రంగా గాయపడి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. అయితే ఈ విషాదం మళ్ళీ మనసు చీల్చకముందే, టీవీకే చీఫ్ విజయ్‌కు సంబంధించిన మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో విజయ్ వ్యవహారంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 27న చెన్నై నుంచి తిరుచ్చి కరూర్‌కు రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న సమయంలో బైక్ పై నుంచి కిందపడిన టీవీకే కార్యకర్తలు బస్సు కిందకు పడ్డారు.

Details

క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స

ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాలపరిస్థితిలో ఆస్పత్రికి చేరారు. అదేవిధంగా, తొక్కిసలాట సమయంలో కార్యకర్తలు కుప్పకూలి, రోడ్డు మీద పడి ఉన్నప్పటికీ, విజయ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ప్రజల అంచనాలకు విరుద్ధంగా, కార్యకర్తలు పెద్ద ఎత్తున అరవడంతో పాటు పార్టీ జెండాలను బస్సుపై విసరడం వంటి ఘటనలపై కూడా ఆయన స్పందించలేకపోవడంతో, టీవీకే సభ్యుల సమాచారం అందించినప్పటికీ, సోషల్ మీడియాలో విజయ్‌పై తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.