PM Modi: తమిళనాడులో ఎన్డీయే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మధురాంతకంలో జరిగే పెద్ద బహిరంగ సభలో పాల్గొనడానికి ముందు,అవినీతి పాలనలో ఉన్న డీఎంకే ప్రభుత్వాన్ని వీడ్కోలు చెప్పే సమయం దగ్గర వచ్చింది అని ఆయన ఎక్స్ (ట్విట్టర్) వేదిక ద్వారా తెలిపారు. అలాగే,తమిళనాడు ప్రజలు ఎన్డీయేతోనే ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చెన్నై-తిండివనం హైవేపై మధురాంతకంలో ఈరోజు మధ్యాహ్నం జరిగే ఈ బహిరంగ సభ ద్వారా ఎన్డీయే తన ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో కూటమిలోని కీలక భాగస్వామి పక్షాలైన అన్నాడీఎంకే,బీజేపీ,పీఎంకే,టీఎంసీ, ఏఎంఎంకే నేతలు పాల్గొననున్నారు.
వివరాలు
ప్రాంతీయ అభిరుచులకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజలను ఆకట్టుకుంటోంది: మోదీ
రాష్ట్రంలోని నలుమూలల నుండి కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రజా వ్యతిరేక డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ సభలో పాల్గొంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఇప్పటికే తెలిపారు. ఎన్డీయే సుపరిపాలన, ప్రాంతీయ అభిరుచులకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజలను ఆకట్టుకుంటోందని ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఈ సభ ద్వారా కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపడం,రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని మరింత వేగవంతం చేయడం ఎన్డీయే లక్ష్యం అని వెల్లడించారు.