LOADING...
RN Ravi: 'జాతీయ గీతం ఆలపించలేదని'.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తమిళనాడు గవర్నర్ ..
'జాతీయ గీతం ఆలపించలేదని'.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తమిళనాడు గవర్నర్ ..

RN Ravi: 'జాతీయ గీతం ఆలపించలేదని'.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తమిళనాడు గవర్నర్ ..

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2026
10:55 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు శాసనసభలో గవర్నర్‌ ఆర్‌.ఎన్‌. రవి (R N Ravi) తన ప్రసంగాన్ని చదవకుండానే వేదిక నుంచి నిష్క్రమించారు. ఈ ఏడాది శాసనసభ తొలి సమావేశం మంగళవారం ప్రారంభం కాగా తన ప్రసంగాన్ని చదవకుండానే ఆయన వాకౌట్‌ చేశారు. తమిళతల్లి ప్రార్థనా గీతం తర్వాత జాతీయగీతం ఆలపించాలని సభాపతిని గవర్నర్‌ కోరగా అందుకు నిరాకరించడంతో ఆయన వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. లోక్‌భవన్‌ ప్రకారం, అన్ని శాసనసభల్లో గవర్నర్‌ ప్రసంగానికి ముందు లేదా తర్వాత జాతీయ గీతం ఆలపిస్తారని చెప్పారు. అయితే, ఈ సందర్భంలో ప్రసంగానికి ముందు జాతీయ గీతాన్ని ఆలపించాలని సూచించినప్పుడు, అది ఉద్దేశపూర్వకంగా నిరాకరించబడిందని వివరించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తమిళనాడు గవర్నర్

Advertisement