
Cough Syrup Tragedy: 'కిల్లర్' దగ్గు సిరప్ తయారీదారుతో సంబంధం ఉన్న 7 స్థలాలపై ఈడీ దాడులు
ఈ వార్తాకథనం ఏంటి
'కోల్డ్‌రిఫ్' దగ్గు మందు వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మందికి పైగా చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ దగ్గు మందును తమిళనాడులోని కాంచీపురం ప్రాంతానికి చెందిన శ్రేసన్ ఫార్మా యూనిట్ తయారు చేసింది. మరణాల విషయం బయటకు రావడంతో అధికారులు ఈ కంపెనీపై తనిఖీ ప్రారంభించారు. తనిఖీ ఫలితాల్లో సిరప్‌లో 48.6 శాతం అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ ఉండినట్లు గుర్తించబడింది. దీనిపై ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు సోమవారం శ్రేసన్ ఫార్మాతో సంబంధం ఉన్న చెన్నైలోని ఏడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీ సమయంలో తమిళనాడు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్‌మెంట్ ఉన్నతాధికారుల నివాసాలకూ అధికారులు దాడులు నిర్వహించినట్లు సమాచారం.
వివరాలు
పలు వైఫల్యాలను గుర్తించిన కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ
శ్రేసన్ ఫార్మా యూనిట్ యజమాని రంగనాథన్ (73) ను ఇటీవల అరెస్టు చేసిన తరువాత ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో,తమిళనాడు ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతోపాటు ఈ ఘటనలకు కారణమని స్పష్టం అయ్యింది. ఇప్పటివరకు ఈ కంపెనీపై ప్రభుత్వ అధికారులు ఒకసారి కూడా తనిఖీ చేయనట్లు బయటకు వచ్చింది. దర్యాప్తులో భాగంగా, కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) పలు వైఫల్యాలను గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ నిబంధనలను విస్మరించిందని, కేంద్రం సూచించిన చర్యలను అనుసరించడంలో విఫలమైందని గుర్తించారు.
వివరాలు
దగ్గు మందు తయారీపై సరైన పర్యవేక్షణ లేదు
మరోవైపు, దగ్గు మందు తయారీపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల విషపూరిత సిరప్ మార్కెట్లోకి చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ నిర్లక్ష్యం చిన్నారుల మరణాలకు కారణమని కూడా పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా, కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ (CDSCO) పలు వైఫల్యాలను గుర్తించినట్లు జాతీయ మీడియా కథనాలు తెలిపాయి. రాష్ట్ర ఔషధ నియంత్రణ సంస్థ నిబంధనలను విస్మరించిందని, కేంద్రం సూచించిన చర్యలను అనుసరించడంలో విఫలమైందని గుర్తించారు. మరోవైపు, దగ్గు మందు తయారీపై సరైన పర్యవేక్షణ లేకపోవడం, సకాలంలో చర్యలు తీసుకోకపోవడం వల్ల విషపూరిత సిరప్ మార్కెట్లోకి చేరిందని అధికారులు వెల్లడించారు. ఈ నిర్లక్ష్యం చిన్నారుల మరణాలకు కారణమని కూడా పేర్కొన్నారు.
వివరాలు
కేంద్ర పోర్టల్‌లో రిజిస్టర్ కాలేదు
ఆ ఫార్మా కంపెనీలో ఏ ప్రభుత్వ ఏజెన్సీ ఆడిట్ కూడా జరిపినట్లు లేదని, కేంద్ర పోర్టల్‌లో రిజిస్టర్ కూడా కాలేదని గుర్తించారు. అదనంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇచ్చే GMP (గుడ్ మాన్యుఫాక్చరింగ్ ప్రాక్టీస్) సర్టిఫికేట్ లేకుండా పదేళ్ల తరబడి ఈ ఫార్మా సంస్థ నడవడానికి తమిళనాడు ప్రభుత్వం అనుమతిచ్చినది అని అధికారులు పేర్కొన్నారు.