
Telangana DCA : అలెర్ట్.. వెంటనే ఆ సిరిప్ వాడకాన్ని ఆపేయండి
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులోని కాంచీపురం జిల్లా నుండి మే నెలలో తయారు చేసిన 'కోల్డ్‌రిఫ్ సిరప్' (Coldrif Syrup) వెంటనే వాడకాన్ని ఆపాలని డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA) ప్రజలకు హెచ్చరించింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో అనేక చిన్నారుల మరణాలకు ఈ సిరప్ వినియోగం సంబంధం ఉండవచ్చన్న నివేదికల నేపథ్యంలో 'SR-13 బ్యాచ్'కు చెందిన సిరప్‌లో మూత్రపిండాల వైఫల్యానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ (DEG) అనే విషపూరిత పదార్థం కలిసివుండే అవకాశం ఉందని దర్యాప్తు కొనసాగుతోంది. ఈ సిరప్‌లో పారాసెటమాల్, ఫినైల్ఫ్రైన్ హైడ్రోక్లోరైడ్, క్లోర్‌ఫెనిరమైన్ మలేట్ వంటి పదార్థాలు ఉంటాయి.
Details
అప్రమత్తంగా ఉండాలి
అయితే ఈ ప్రమాదకరమైన బ్యాచ్‌లో DEG కలిసివుండే అవకాశం ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ రకమైన బ్యాచ్‌ను ఎవరు కలిగి ఉంటే, వెంటనే స్థానిక DCA అధికారులకు లేదా DCA టోల్-ఫ్రీ నంబర్ 1800-599-6969 ద్వారా తెలియజేయాలని అధికారులు పౌరులకు విజ్ఞప్తి చేశారు. ప్రజా భద్రత కోసం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రగ్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు ప్రభావిత బ్యాచ్‌లో ఉన్న ఏవైనా స్టాక్‌లను గుర్తించి, వాటి సరఫరాను నిలిపివేయడానికి ఫార్మాసీలు, హోల్‌సేల్ వ్యాపారులు, ఆసుపత్రులను అప్రమత్తం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఆరోగ్య సమస్యలను నివారించడానికి పౌరులు, రిటైలర్లు, ఆరోగ్య సంరక్షణ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత నిల్వలు ఉంటే DCAకి తెలియజేయాలని అథారిటీ విజ్ఞప్తి చేసింది.