LOADING...
Cough syrup deaths: దగ్గు మందు రాసిన వైద్యుడికి 10% కమిషన్ .. కోర్టుకు తెలిపిన పోలీసులు 
కోర్టుకు తెలిపిన పోలీసులు

Cough syrup deaths: దగ్గు మందు రాసిన వైద్యుడికి 10% కమిషన్ .. కోర్టుకు తెలిపిన పోలీసులు 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 14, 2025
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్‌లోని చింద్వారా ప్రాంతంలో 'కోల్డ్‌రిఫ్‌' దగ్గు మందు కారణంగా 20 కంటే ఎక్కువ చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న తమిళనాడు పోలీసులు కొన్ని కీలక విషయాలను వెలువరించారు. ఈ కేసులో ఇటీవల అరెస్టైన వైద్యుడు డాక్టర్‌ ప్రవీణ్‌ సోని పై పోలీసులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన వద్ద వైద్యం పొందేందుకు వచ్చిన రోగులకు మందుల చీటీలో 'కోల్డ్‌రిఫ్‌' దగ్గు మందును రాయడం ద్వారా 10% కమీషన్ పొందే విధంగా మందు తయారీ సంస్థ శ్రేసన్‌ ఫార్మాతో డాక్టర్‌ ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు సెషన్స్ కోర్టుకు వివరించారు.

వివరాలు 

మందుల షాప్‌పై కూడా దర్యాప్తు

పోలీసుల సమాచారం ప్రకారం, భారత ప్రభుత్వం ఆరోగ్యసేవల డైరెక్టరేట్ జనరల్ డిసెంబర్ 18, 2023న 4 ఏళ్లకంటే తక్కువ వయసున్న పిల్లలకు ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్లు (FDC) ఇవ్వకూడదని మార్గదర్శకాలు జారీ చేసింది. అటువంటి మందుల వల్ల చిన్నారుల్లో మూత్రపిండాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ, డాక్టర్‌ ప్రవీణ్‌ సోని వాటిని సూచించడంలో మునిగి ఉన్నారని పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం, ఆయన వైద్యం చేసిన చిన్నారులలో మూత్ర సంబంధిత సమస్యలతో ఇప్పటి వరకు 15 మంది పిల్లలు మృతి చెందారు. డాక్టర్‌ క్లినిక్ పక్కనే ఉన్న మందుల షాపు కూడా ఆయన కుటుంబ సభ్యులతో సంబంధమున్నదిగా గుర్తించబడింది. ఈ కారణంగా ఆ షాప్‌పై కూడా దర్యాప్తు జరుగుతోంది.

వివరాలు 

దగ్గుమందులో కలుషితాలను చేర్చిన విషయం డాక్టర్‌'కి తెలియలేదు 

అయితే, డాక్టర్‌ తరఫున న్యాయవాది పోలీస్ ఆరోపణలను ఖండించారు. మందుల తయారీ సంస్థ దగ్గుమందులో కలుషితాలను చేర్చిన విషయం అతడికి తెలియదన్నారు. చింద్వారాలో అక్టోబర్ 5న డాక్టర్‌ ప్రవీణ్‌ సోనిని పోలీసులు అరెస్ట్ చేశారు. నాలుగేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సిరప్ సూచించినందున న్యాయస్థానం బెయిల్ ఇవ్వకూడదని నిర్ణయించింది. డాక్టర్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసిన విషయం ఆధారంగా అదనపు సెషన్స్ జడ్జి గౌతమ్ కుమార్ గుజార్ (పరాసియా) ఈ కేసును విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.