LOADING...
Tamilnadu: తిరువళ్లూరులో దారుణం.. వలస కార్మికుడిపై మైనర్ల అటాక్.. వీడియో వైరల్
తిరువళ్లూరులో దారుణం..వలస కార్మికుడిపై మైనర్ల అటాక్..వీడియో వైరల్

Tamilnadu: తిరువళ్లూరులో దారుణం.. వలస కార్మికుడిపై మైనర్ల అటాక్.. వీడియో వైరల్

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 29, 2025
10:30 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మధ్యప్రదేశ్‌ కు చెందిన వలస కార్మికుడు సిరాజ్‌పై నలుగురు బాలురు కత్తులు, వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ అమానవీయ ఘటనను నిందితులు తమ ఫోన్లలో రికార్డ్ చేయడం,ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ కావడం వలన స్థానికంగా పెద్ద కలకలం సృష్టించింది. రైలు ప్రయాణంలో ఉన్నప్పుడు మొదలైన ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. కదులుతున్న రైలులో నిందితులు సిరాజ్‌ను ఆయుధాలతో బెదిరించి, భయపెట్టారు. తర్వాత అతడిని రైల్వే స్టేషన్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి వేటకొడవళ్లతో దారుణంగా దాడి చేశారు.

వివరాలు 

ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న సిరాజ్ 

ఈ దాడి చేస్తున్న సమయంలో ఒక నిందితుడు ఏమాత్రం భయం లేకుండా కెమెరా వైపు విక్టరీ సింబల్ చూపించడం వారి ఉన్మాదానికి పరాకాష్ఠగా నిలిచింది. ప్రస్తుతం సిరాజ్ పరిస్థితి విషమంగా ఉంది అని వైద్యులు వెల్లడించారు. వైరల్ వీడియో ఆధారంగా తిరువళ్లూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితులు మైనర్లు కావడంతో, ఈ దారుణానికి వెనుక అసలు కారణాలను గుర్తించడానికి పోలీసులు సవివరంగా విచారణ చేస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నిర్మానుష్య ప్రాంతంలో సిరాజ్ పై  దాడి

Advertisement