తదుపరి వార్తా కథనం
Tamil Nadu: తమిళనాడులో రెండు బస్సుల ఢీ.. 11 మంది దుర్మరణం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 30, 2025
07:22 pm
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివగంగ జిల్లాలోని తిరుపత్తూర్ సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న ఈ భయానక ఘటనలో తొమ్మిదిమంది మహిళలతో సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కారైక్కుడి నుంచి దిండుక్కల్ దిశగా వెళ్తున్న బస్సు, తిరుప్పూర్ నుంచి కారైక్కుడి వైపు వస్తున్న మరో బస్సు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఢీకొట్టిన దెబ్బకు డ్రైవర్ సహా ఎనిమిది మంది ఘటనాస్థలిలోనే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు తిరుపత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తరువాత ప్రాణాలు విడిచారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 11కు పెరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 40మంది గాయపడగా, వారందరినీ తిరుపత్తూరు, మదురై, కారైక్కుడి ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.