SIR: తమిళనాడులో ఓటర్ల జాబితా సవరణ : ఈసీ వెల్లడి
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడులో కూడా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) నిర్వహణకు సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో ఒక వారంలో ఎస్‌ఐఆర్ (SIR) ప్రారంభం అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మద్రాస్ హైకోర్టుకు తెలిపింది. అస్సాం,కేరళ,పుదుచ్చేరి,తమిళనాడు,పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల శాసనసభలకు 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ చర్య అనివార్యం అయ్యింది. దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్ నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ ఇది వరకే వెల్లడించిన సంగతి తెలిసిందే.
వివరాలు
22 ఏళ్ల విరామం తర్వాత బిహార్ లో సవరణ
ఈ ప్రక్రియ ఇప్పటికే బిహార్‌లో పూర్తి అయ్యింది, అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ముందు 22 ఏళ్ల విరామం తర్వాత ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టారు. కానీ ఈ చర్యపై విపక్షాలు విమర్శలు వ్యక్తం చేశాయి. కాంగ్రెస్ పార్టీతో సహా కొన్ని రాజకీయ నాయకులు, బిహార్‌లో ఎస్‌ఐఆర్ పేరుతో బిహార్‌లో పెద్ద ఎత్తున ఎన్నికల రిగ్గింగ్ జరుగుతోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పుడు, హస్తం పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా ఈసీ ఉద్దేశపూర్వకంగా ఓటర్లను జాబితా నుండి తొలగిస్తున్నారని మండిపడ్డారు.