Actor Vijay: పుదుచ్చేరిలో విజయ్ బహిరంగ సభ.. తుపాకీతో భద్రతా సిబ్బందికి పట్టుబడిన వ్యక్తి..!
ఈ వార్తాకథనం ఏంటి
కరూర్ ఘటన తరువాత,ప్రముఖ నటుడు,టీవీకే (TVK)చీఫ్ విజయ్ నేడు పుదుచ్చేరి లో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభ ఉప్పాలం(Uppalam)ఎక్స్‌పో గ్రౌండ్‌లో జరిగింది. కరూర్ ఘటన నేపథ్యంలో,పుదుచ్చేరి పోలీసులు విజయ్ సభకు ఘనమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభ ప్రాంగణంలో ప్రవేశించే ప్రతి వ్యక్తిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈ తనిఖీలలో ఒకరు గన్ తో సభలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా,భద్రతా సిబ్బంది అతన్ని పట్టుకున్నారు. ఆ వ్యక్తిని శివగంగై జిల్లా టీవీకే కార్యదర్శి ప్రభుకు గార్డుగా ఉన్న డేవిడ్‌గా అధికారులు గుర్తించారు. పుదుచ్చేరి పోలీసులు విజయ్ సభకు అనుమతి ఇచ్చినప్పటికీ,కరూర్ ఘటన కారణంగా కొన్ని షరతులు విధించారు. ఆ షరతుల ప్రకారం,విజయ్ సభా వేదికపై కాకుండా ప్రచార రథం పై నుంచే ప్రసంగించనున్నారు.
వివరాలు
12 గంటలకు ప్రసంగం ప్రారంభం
సభలో 5 వేల మందికి మించి హాజరు కాకూడదు.చిన్నారులు, గర్భిణీ మహిళలు, వృద్ధులు సభలో హాజరు కాకూడని నిబంధనను పోలీసులు తెలిపారు. అందుకే పార్టీ 5 వేల మందికే ఎంట్రీ పాసులు ఇచ్చేలా ఏర్పాట్లు చేసుకుంది. పాసు కలిగినవారు మాత్రమే సభలో ప్రవేశించగలరు. ఈ షరతుల దృష్ట్యా, పుదుచ్చేరి సమీపంలోని తమిళనాడు జిల్లాల ప్రజలు సభకు రాకుండా టీవీకే కోరింది. సభ నిర్వాహకుల వివరాల ప్రకారం, విజయ్ ప్రచార రథం సోమవారం రాత్రే పుదుచ్చేరికి చేరుకుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు ఆయన కారులో సభా స్థలానికి చేరుకుంటారు. సభకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు అనుమతి ఉంది. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసంగం ప్రారంభిస్తారని అధికారులు తెలిపారు.