LOADING...
Kayadu Lohar: టాస్మాక్‌ వివాదంలో పేరు.. స్పందించిన కయాదు లోహర్
టాస్మాక్‌ వివాదంలో పేరు.. స్పందించిన కయాదు లోహర్

Kayadu Lohar: టాస్మాక్‌ వివాదంలో పేరు.. స్పందించిన కయాదు లోహర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2025
03:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో మద్యం రిటైలర్‌ టాస్మాక్‌ (Tamil Nadu State Marketing Corporation) కుంభకోణంలో తన పేరు వచ్చిన వార్తలు చూసి ఎంతో మనస్తాపానికి గురయ్యానని నటి కయాదు లోహర్‌ (Kayadu Lohar) స్పష్టంచేశారు. ఇటీవల ప్రచారంలోకి వచ్చిన రూమర్స్‌పై ఆమె ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. టాస్మాక్‌ కుంభకోణానికి సంబంధించిన వ్యక్తులు నిర్వహించిన ఓ పార్టీకి కయాదు లోహర్‌ హాజరయ్యారని, అందుకు ఆమె రూ.35 లక్షలు ఎగ్గొట్టారని సోషల్‌ మీడియాలో ప్రచారం జరిగింది. ఈ ఆరోపణలను ఆమె ఖండిస్తూ స్పందించారు.

Details

చాలా తీవ్రంగా బాధపడ్డా

ఇలాంటి వార్తలు వచ్చినా బాధపడకుండా ముందుకు సాగడం చాలా మందికి సులభమని అనిపిస్తుంది. కానీ వాస్తవం అలా కాదు. ఆ వార్తలు చూసి నేను తీవ్రంగా బాధపడ్డా. నా కలలను నెరవేర్చుకోవడానికి, ఇండస్ట్రీలో కష్టపడి స్థిరపడడానికి ప్రయత్నిస్తున్న సమయంలో ఇలా నిరాధార ఆరోపణలు రావడం చాలా బాధించాయని కయాదు తెలిపారు. ఇటీవల విడుదలైన 'రిటర్న్‌ ఆఫ్‌ ది డ్రాగన్‌' చిత్రంతో కయాదు లోహర్‌ తెలుగు ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆమె విశ్వక్‌సేన్‌ సరసన 'ఫంకీ' (Funky) చిత్రంలో నటిస్తున్నారు.