LOADING...
Tamil Nadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు టైరు పేలి 9 మంది మృతి
బస్సు టైరు పేలి 9 మంది మృతి

Tamil Nadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు టైరు పేలి 9 మంది మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 25, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.కడలూరు జిల్లాలో ఆర్టీసీబస్సు రెండు కార్లను ఢీ కొట్టడంతో 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నపిల్లలు సహా నలుగురు గాయపడ్డారు.చెన్నైకు బయల్దేరిన ఆర్టీసీ బస్సు టైరు పేలడంతో అదుపు తప్పిపోయి ఈ ఘోరం చోటు చేసుకుంది. బస్సు ముందుగా వెళ్తున్న రెండు కార్లను ఢీకొట్టడం కారణంగా ఈప్రమాదం సంభవించింది. స్థానికులు వెంటనే గాయపడ్డవారిని హాస్పిటల్‌లకు తరలించారు.ఘటనపై సీఎం స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఒక్కోరికి రూ.లక్ష ఆర్థికసహాయం,గాయపడినవారికి ఒక్కోరికి రూ.లక్ష చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించారు. పోలీసులు ఈ ఘటనా స్థలంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.బస్సు డ్రైవర్ వేగంగా నడిపారా,ఇతర కారణాలు ఏమిటో కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తమిళనాడులో ఆర్టీసీ బస్సు ఘోర ప్రమాదం

Advertisement